బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (22:38 IST)

అక్టోబరు 5కి ‘జగనన్న విద్యా కానుక’ వాయిదా

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలనుకున్న ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్య సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమాన్ని సెప్టెంబరు5వ తేదీన ప్రభుత్వం నిర్వహించాలనుకున్న విషయం విదితమే. అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన  కోవిడ్ – 19 అన్ లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబరు 30 దాకా పాఠశాలలు తెరవకూడదని నిర్ణయించడం వలన  ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 5వ తేది నాటికి వాయిదా వేస్తున్నట్లు తాత్కాలికంగా నిర్ణయించడమైనదని పేర్కొన్నారు.
 
‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమం అక్టోబరు 5వ తేదీన ఏర్పాటవుతుంది కాబట్టి ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు,  ఉపాధ్యాయులు, అధికారులు గమనించాలని పాఠశాల విద్య సంచాలకులు వారు కోరారు.