జగన్ చేతకానితనం తెలిసిపోయింది : బోండా ఉమ
సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ ప్రజా చైతన్యయాత్ర నిర్వహించింది. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక అసమర్థుడు పాలన సాగిస్తున్నారన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఏమీ పట్టనట్లు సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిది నెలల కాలంలో జగన్ చేతకానితనం తెలిసిపోయిందన్నారు.
ప్రజావ్యతిరేక విధానాలను అమలుచేస్తూ, జగన్ నియంత పాలన సాగిస్తున్నారని బోండా ఉమ విమర్శించారు. పెన్షన్లను తొలగించి వృద్ధులు, వికలాంగులను రోడ్డున పడేశారన్నారు. నిరుద్యోగభృతి, కల్యాణ కానుక వంటి పథకాలను రద్దు చేశారని బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.