పరివర్తన్ కింద హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు
తూర్పు గోదావరి జిల్లాలోని గిరిజన ప్రాంతమైన రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నెలకొల్పిన ఆక్సిజన్ ప్లాంట్‌ను జిల్లా కలెక్టర్ శ్రీ సి.హరికరిణ్ నేడు ప్రారంభించారు. కొవిడ్-19 వేవ్‌ను తట్టుకునేలా ఏజెన్సీ ప్రాంతంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను ఈ ప్లాంట్ బలోపేతం చేస్తుంది. ప్రెషర్ స్వింగ్ అబ్సాప్షన్ ఉపయోగించే ఈ ప్లాంట్ ప్రతీ గంటకు 57.60 క్యూబిక్ మీటర్ల లేదా 960 ఎల్‌పీఎం (5 ఎల్‌పీఎం ఫ్లో రేటుతో 195 బెడ్స్‌కు అందిస్తుంది) ఉత్పత్తి చేసే సామర్ధ్యం కలిగి ఉంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ప్రతిష్ఠాత్మక సీఎస్‌ఆర్ కార్యక్రమం పరివర్తన్ కింద రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పీఎస్‌ఎ ప్లాంట్లు నెలకొల్పింది. ఏజెన్సీ ప్రాంతంలో ఆరోగ్యసంరక్షణ మౌలికసదుపాయాలు బలోపేతం చేసేందుకు ఈ పీఎస్‌ఎ ప్లాంటును బ్యాంక్ నెలకొల్పింది.
“కొవిడ్‌పై పోరాటంలో దేశం వెంట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉండటమే కాదు ఫ్రంట్‌లైన్ వర్కర్లకు చేయూతగా నిలుస్తోంది” అన్నారు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏపీ సర్కిల్ 2, సర్కిల్ హెడ్ శ్రీ టీవీఎస్ రావ్. “మహమ్మారి సమయంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాల గురించి బ్యాంకుకు తెలుసు. మా ప్రతిష్ఠాత్మక సీఎస్‌ఆర్ కార్యక్రమం పరివర్తన్ కింద చేయాల్సినంత సాయాన్ని మేము చేశాం. అంతేకాదు కోవిడ్ ద్వారా ప్రభావితులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్స్, యువత, రైతులు, మహిళలకు రకరకాల వృత్తుల్లో శిక్షణను బ్యాంకు అందిస్తోంది. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర సంసిద్ధతను బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా నిలుస్తున్నందుకు బ్యాంకు గర్విస్తోంది” అన్నారు.
ఈ ఆక్సిజన్ ప్లాంట్ వలన ఆస్పత్రి స్వయం సమృద్ధి సాధిస్తుంది. దూర ప్రదేశాల నుంచి క్రయోజెనిక్ ట్యాంకర్ల ద్వారా తీసుకువచ్చే ఆక్సిజన్‌పై ఆధారపడాల్సిన అవసరం తొలగిపోతుంది. గ్రామీణాభివృద్ధి, విద్య, నైపుణ్యాభివృద్ధి, మెరుగైన జీవనోపాధి, ఆరోగ్య సంరక్షణ & పరిశుభ్రత, ఆర్థిక సాక్షరత వంటి రంగాలలో జోక్యం చేసుకుంటూ లక్షలాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడంలో ఉత్ప్రేరకంగా పనిచేస్తోంది పరివర్తన్.