సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 జనవరి 2022 (10:37 IST)

మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించనున్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా థర్డ్ వేవ్ కారణంగా పొంచివున్న ముప్పును ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతుంది. ఇందులోభాగంగా, వైద్య మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచుతుంది. మెరుగుపరుస్తుంది కూడా. ఇందులోభాగంగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 133 పీఎస్ఏ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. 
 
వీటిని సీఎం వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఒమిక్రాన్ వైరస్ ప్రభావంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా నమోదవుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ ప్లాంట్లు కోవిడ్ మహమ్మారి బారినపడిన వారికి చికిత్స అందించండంలో కీలక పాత్ర పోషించనున్నాయి. 
 
ఈ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఆస్పత్రుల ప్రాంగణాల్లోనే ఏర్పాటు చేసింది. ప్రెజర్ స్వింగ్ అబ్జార్షన్ పద్ధతిలో తయారైన ఆక్సిజన్, పైపులైన్ల ద్వారా నేరుగా రోగికి చేరుతుంది. అలాగే, ఈ ఆక్సిజన్‌ను సిలిండర్లలో కూడా నింపవచ్చు. వివిధ సామర్థ్యాలతో ఈ పీఎస్ఏ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. 1000 ఎల్పీఎం, 500 ఎల్పీఎం సామర్థ్యంలో వీటిని ఏర్పాటు చేశారు.