శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 మార్చి 2020 (08:29 IST)

77వ రోజుకు రాజధాని ఆందోళనలు

అమరావతి రాజధాని రైతుల ఆందోళనలు 77వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో రైతుల ధర్నా కొనసాగుతోంది. అటు వెలగపూడిలో 77వ రోజు రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.

పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో రైతులు ధర్నాలు చేయనున్నారు. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 
 
గత ప్రభుత్వంలో ఎన్టీఆర్‌ హౌసింగ్‌ పథకం కింద తమకు కేటాయించిన ఇళ్లను వెంటనే అప్పగించాలని రాజధాని లబ్ధిదారులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు మూకుమ్మడిగా సీఆర్‌డీఏకు అర్జీలు సమర్పించారు.

5,200 ఇళ్లకుగాను ఎలాట్‌మెంట్‌లు ఇచ్చారని దానికోసం వడ్డీలకు తెచ్చి రూ.లక్ష నుంచి రూ.500 వరకు ప్రభుత్వానికి కట్టామని తెలిపారు.

అన్నీ సిద్ధంగా ఉన్న ఇళ్లను తమకు ఇవ్వకుండా ఇక్కడి భూములను ఎక్కడో పేదలకు ఇస్తామనడం మాలో మాకు తగవులు పెట్టడం కాదా..? అని నిలదీశారు.