Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మలతో మాట్లాడే ముఖ్యమంత్రి జగన్‌: చంద్రబాబు

Written By ఎం
Updated: గురువారం, 15 జులై 2021 (08:47 IST)
‘‘పరిపాలనను, ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి ఆత్మలతో మాట్లాడే ముఖ్యమంత్రిని ప్రస్తుతం చూస్తున్నాం. అధికారంలోకి వచ్చేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని బతిమలాడుకున్న జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రజల సంక్షేమాన్ని గాలికి ఒదిలేశారు. ధరలతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఆఖరుకు చెత్తపై కూడా ఈ చెత్త ప్రభుత్వం పన్నులు విధిస్తోంది. ముందు ముందు జుట్టు పన్నుకూడా వేస్తారు. ఇక అందరూ గుండు కొట్టించుకోవాల్సిందే’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.

బడిలో పాఠాలు చెప్పాల్సిన టీచర్లను మద్యం దుకాణాల వద్ద మందు బాబులను క్యూలో నిలబెట్టే పని చేయించుకున్నఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. జగన్‌రెడ్డి పాలనలో ప్రభుత్వ ఖజానా వెలవెలబోతుంటే, ఆయన సొంత ఖజానా గలగల మంటోందన్నారు.

భారతి సిమెంటు లాభాలు ఎలా పెరుగుతున్నాయో జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించిన జగన్‌రెడ్డి ఇంతవరకు సీపీఎ్‌సను ఎందుకు రద్దు చేయలేని చంద్రబాబు ప్రశ్నించారు. 

అన్నీ చూడండి

Sangeeth Shobhan : కొత్త సినిమా పోస్టర్ తో పుట్టినరోజు జరుపుకున్న సంగీత్ శోభన్

Raaka Update: అల్లు అర్జున్, అట్లీల చిత్రంలో విల్ స్మిత్, షారుఖ్ ఖాన్‌ ఎంట్రీ ఇవ్వనున్నారా !

ముగిసిపోయిన బంధానికి అనుపమ మళ్లీ ప్రాణం పోయడం ఎందుకు?

NTR emotional : పెంపుడు కుక్క భఘీరను కోల్పోయిన ఎన్టీఆర్. భావోద్వేగ పోస్ట్

Brahmanandam: తోడబుట్టిన అన్నయ్య ను పలుకరించే భాగ్యం బ్రహ్మానందం కు లేదా ?

తర్వాతి కథనం
Show comments