వ్యవసాయాభివృద్దితో మరో హరిత విప్లవం: మంత్రి కన్నబాబు
సీఎం జగన్ అమలు చేస్తున్న వ్యవసాయ, అనుబంధ రంగాల సంక్షేమ పధకాలతో మరో హరిత విప్లవం మొదలైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల అభివృద్ధి కోసం పలు పథకాలను ప్రవేశపెట్టి రైతులకు రెట్టింపు ఆదాయం కలిగేలా మరో వైపు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
గత రెండు సంవత్సరాలలో రైతుల కోసం సుమారు 83వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని ఆయన తెలిపారు .
రైతుల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ లో సుమారు 10800 RBKలు పనిచేస్తున్నాయని , వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు .ఈ నూతన ఉత్పాదన నానో యూరియాను కూడా RBKల ద్వారా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నెల్లూరులోని ఇఫ్కో కిసాన్ సెజ్ సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొనివెళ్లి తగు పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని చెప్పారు.