మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (20:02 IST)

మేనిఫెస్టోలో చెప్పింది.. చెప్పనిదీ చేసిన సీఎం జగన్: మంత్రి కన్నబాబు

శాసనసభలో వ్యవసాయం మీద జరిగిన చర్చలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన బాకీలు రాష్ట్రానికి భారంగా మారినా రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం వీడలేదన్నారు. 2019-20లో వైయస్‌ఆర్‌ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద 2020-21 ఖరీఫ్‌ వరకు రూ.11,981 కోట్లు రైతుల ఖాతాల్లో డీబీటీ ద్వారా నగదు బదిలీ చేయటం జరిగింది.

ఇది కాకుండా చంద్రబాబు పెట్టిన బాకీలు, వైయస్‌ఆర్ సున్నా వడ్డీ కింద రూ.1,073 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయటం జరిగింది. ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.409.15 కోట్లు ఇవ్వటం జరిగింది. ఈ మొత్తం కలిపి రూ.13,463.50కోట్లు డీబీటీ కింద రైతుల ఖాతాల్లో సీఎం జగన్ వేశారని అన్నారు.

ఈ పథకం కావాలని ఎవ్వరి వద్దకూ వెళ్లాల్సిన అవసరం లేదు. అర్హత ఉంటే వారి ఇంటికి వాలంటీర్‌ వెళ్లి అందజేస్తారని, గ్రామ సచివాలయాల్లో నమోదు చేయించుకుంటే వారికి అందాల్సిన పథకాలను సీఎం జగన్‌ అందజేస్తున్నారన్నారు. 2014-19 మధ్య రూ.12,700 కోట్లు రుణమాఫీకి చెల్లింపులు చేస్తే.. ఈ ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో రూ.13,463.50 కోట్లు రైతుల ఖాతాల్లో వేయటం జరిగిందని కన్నబాబు వివరించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014-2015 మధ్య రుణమాఫీ కోసం రూ.12,731 కోట్లు చెల్లించిందని ఆర్బీఐ తెలిపిందని ఈ వార్త ఈనాడు దినపత్రికలో వచ్చిందని కన్నబాబు తెలిపారు. 
 
వ్యవసాయం మీద సీఎం జగన్ సమీక్ష చేయని రోజు లేదని ఇది రైతు పక్షపాతి ప్రభుత్వమని కన్నబాబు అన్నారు. విత్తనం విక్రయించే దగ్గర నుంచి రైతాంగానికి అండగా ఈ ప్రభుత్వం ఉండాలని దీని కోసం ప్రణాళిక తయారు చేయమని తను అండగా నిలబడతానని సీఎం జగన్ ప్రతి సందర్భంలోనూ చెప్పారు. ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించి 2019-20కి చారిత్రాత్మక సంవత్సరంగా గుర్తించాలని దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమని కన్నబాబు అన్నారు.

ఇప్పటి వరకు మార్కె్ట్‌ ఇంటర్వెన్షన్‌ లెక్కలు చూస్తే రూ.4,607 కోట్ల విలువైన పంట ఉత్పత్తులను ప్రభుత్వం 
నేరుగా కొనుగోలు చేసింది. సహజంగా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పీలు ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేస్తుంటాయి. అయితే, కేంద్రం చెప్పిన పంటలు మాత్రమే కాకుండా నిల్వ ఉండని పంటలు కూడా ఎంఎస్‌పీ ప్రకటించిన మొట్టమొదటి ప్రభుత్వం ఇదని కన్నబాబు తెలిపారు.

క్వింటాలు మిర్చికి రూ.7,000లు, క్వింటాలు పసుపు రూ.6,850లు క్వింటాలు ఉల్లి రూ.770లు, క్వింటాలు 
చిరుధాన్యాలకు రూ.2500లు, క్వింటాలు అరటి రూ.800లు, క్వింటాలు బత్తాయి రూ.1400లు ప్రకటించడం జరిగింది. వేరుశెనగ ఆశించిన విధంగా దిగుబడి రాలేదు. ఎక్కువ వర్షాల వల్ల పంట నష్టపోయి నాణ్యత తగ్గిపోతే గ్రేడ్‌ 1 వేరుశెనగకు రూ.4800లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగిందని తెలిపారు.

సూక్ష్మస్థాయిలో ప్రతి విషయంలో రైతులను ఏ విధంగా ఆదుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రైతు భరోసా కేంద్రాలు కొనుగోలు కేంద్రాలుగా ప్రభుత్వం ప్రకటించింది. పంట పండించిన తర్వాత అమ్ముకోవాలనుకుంటే రైతు భరోసా కేంద్రంలో నమోదు చేసుకుంటే కొనుగోలు చేసే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుందని కన్నబాబు తెలిపారు. ప్రభుత్వ పరంగా ఎంఎస్‌పీకి కొనుగోలు చేయటమేకాకుండా బయట మార్కెట్‌ అనుగుణంగా రైతాంగానికి లబ్ధి చేకూరేలా ఈ ప్లాట్‌ఫాం తీసుకువస్తాన్నామన్నారు.

సీఎం యాప్ అని ఒకటి తీసుకువచ్చామని అందులో ప్రతిరోజు ప్రతి ఊర్లో ఏ పంట ఎంత దిగుబడి వచ్చింది. ఎంత ధర ఉందో యాప్‌లో నమోదు చేయటం జరుగుతోందన్నారు. ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు వస్తే ఆ యాప్‌లో రెడ్‌ కలర్‌లో చూపిస్తుందని అధికారులు అలర్ట్ అవుతారని కన్నబాబు వివరించారు.

సీఎం జగన్ ఆదేశాలతో  యాప్‌ను రూపకల్పన చేయటం జరిగిందన్నారు. ప్రతిరోజు యాప్‌ పరిశీలిస్తారని దీనికోసం ఓ వ్యవస్థ పనిచేస్తోందని కన్నబాబు అన్నారు. పొగాకు కొనుగోళ్లుదారులు కొవిడ్ వల్ల సమస్యలు ఉన్నాయని చెబితే సీఎం  జగన్ స్పందించి పొగాకు కొనుగోళ్లు ప్రభుత్వమే ప్రారంభించింది. రూ.120 కోట్ల విలువైన 12.93 మిలియన్ కేజీల 
పొగాకును కొనుగోలు చేయటం జరిగింది.

మూడు రోజుల క్రితం మీటింగ్‌లో పొగాకు అమ్మకంపై జరిగింది. పొగాకు రైతుల కోసం కొనుగోళ్లు, అమ్మకాలు గురించి తెలియక ముందే ప్రభుత్వం కొనుగోలు చేసింది. నష్టం వచ్చినా ముందు రైతుల కోసం కొనుగోలు  చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇదే సాహసాన్ని గత ప్రభుత్వాలు రైతుల కోసం ఎందుకు తీసుకోలేకపోయాయ్? గట్టి సంకల్పం 
కావాలి. అలాంటి మంచి మనస్సు ఉన్న ముఖ్యమంత్రి ఉండటం వల్లనే ఇది సాధ్యమైంది. 5982 (ధాన్యం) ఎంఎస్‌పీ ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లు, వేరుశెనగ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
 
*ప్రతికూలంగా పత్తి సీజన్ *
పత్తి పంటకు వాతావరణం ప్రతికూలంగా ఉంది. వర్షాలు అధికంగా ఉండటం, వాతావరణంలో తేమ ఉంది. సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు జరుగుతాయి. జిన్నింగ్ మిల్లులు ఎక్కడుంటే అక్కడ పత్తి కొనుగోలు చేస్తామని మార్కెట్ యార్డులో కొనుగోలు చేయమని సీసీఐ తెలిపింది. పత్తి ట్రాన్స్‌పోర్టుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వం భరిస్తుందని సీఎం  నిర్ణయం తీసుకున్నారు. తద్వారా రైతుకు మేలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాత్కాలికంగా చేయటం సరికాదని శాశ్వత ప్రాతిపదికన ప్రతి గ్రామంలో ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.

ప్రతి గ్రామంలోనూ గోడౌన్లు, అవసరమైనచోట్ల కోల్డ్‌ స్టోరేజీలు, షార్టింగ్, గ్రేడింగ్ ఎక్విప్‌మెంట్లు, మిల్క్‌ కలెక్షన్‌ సెంటర్‌, సుమారు 9,900  గ్రామాల్లో బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్ సెంటర్, జనతా బజార్లు రూ.10,000 కోట్లతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ఆరోగ్య సమస్యలతో పాటు ఇతర సమస్యలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలో పాఠాలు నేర్పింది.

మన పంటలకు మన దగ్గర మార్కెట్ చేసుకోవటం కోసం జనతా బజార్లు ఏర్పాటు చేయాలని సీఎం గారు ఆదేశించారు. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో చేపలు, తూర్పు గోదావరిలో రొయ్యలు అనంతపురం, కడప మార్కెట్‌లో అమ్మే కార్యక్రమం చేయటానికి వ్యవస్థను రూపొందిస్తున్నాము కోనసీమలో కొబ్బరికాయలు రేటు పడిపోతే అనంతపురం, వేరొక చోట అమ్మేలా సూక్ష్మస్థాయిలో వ్యవస్థ రూపొందిస్తున్నాము. దీనికోసం త్వరలో ఒక కార్యక్రమాన్ని సీఎం  ప్రారంభించనున్నారని కన్నబాబు తెలిపారు. 
 
- ప్రతి రైతు భరోసా కేంద్రంలో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో,  65 అగ్రో హబ్‌లలో కస్టమ్‌ హైరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీ) ఏర్పాటు చేస్తున్నామని అక్కడ రైతులకు కావాల్సిన చిన్న పరికరాల నుంచి పెద్ద పరికరాల వరకు లభిస్తాయి. వీటి నిర్వహణ రైతు సంఘాలకు సబ్సిడీ మీదనే ఇస్తున్నామని కన్నబాబు తెలిపారు. 
 
- 3,99,247 సీసీఆర్‌సీ కార్డులును ప్రభుత్వం ఇవ్వటం జరిగిందని కన్నబాబు తెలిపారు. దీనివల్ల 11 నెలల పాటు రైతు భూయాజమాన్య హక్కులు నష్టపోకుండా కౌలుదారులకు హక్కు ఇస్తూ చట్టాన్ని ఈ సభలోనే చేశామని కన్నబాబు తెలిపారు. ప్రతి సంఘానికి లక్ష నుంచి లక్షన్నర వరకు ఎలాంటి హామీ లేకుండా రుణాన్ని ఇస్తున్నామన్నారు.

కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పాడి రైతులకు, పంటలు పండించే రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించే కార్యక్రమం చేస్తున్నాము. రైతు భరోసా కేంద్రాలు విప్లవాత్మక నిర్ణయం అని దీనిపై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి రిశీలిస్తున్నారన్నారు. నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు లభించటమే కాకుండా విజ్ఞాన కేంద్రాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. విజయవాడలో ఉన్న సైంటిస్టులు గ్రామాల్లో ఉన్న రైతులతో చర్చించేలా ఏర్పాట్లు చేశామన్నారు. 

కర్నాటక నుంచి అధికారుల బృందం కూడా వచ్చి ఆర్బీకేలను పరిశీలించిందని కన్నబాబు తెలిపారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ఎరువులు పొందవచ్చు.  తద్వారా రోజుల తరబడి క్యూలైన్‌లో రైతులు నిలబడాల్సిన అవసరం లేదన్నారు. 
 
- చెప్పింది మాత్రమే కాదు..చెప్పనిదీ కూడా అమలు చేస్తున్న ప్రభుత్వం ఇదన్నారు. వైయస్‌ఆర్ జలకళ కింద ఉచితంగా బోర్లు మాత్రమే కాకుండా మోటార్లు, పైపులు కూడా ఇచ్చింది. రూ.4,000 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందన్నా సీఎం నిర్ణయం తీసుకున్నారు. 
 
అమూల్‌తో సహకార డెయిరీల బలోపేతం
- పాల వెల్లువ విషయానికి వస్తే.. కొన్ని ప్రైవేటు డెయిరీల కోసం ప్రభుత్వ సహకార రంగ డెయిరీలు నాశనం చేశారు. దేశంలో పేరుగాంచిన అమూల్ తెచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వరదలు రావటంతో డిసెంబర్ 2వ తేదీకి కార్యక్రమం వాయిదా పడింది.

అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకోవటం వల్ల 9,899 మిల్క్‌ కలెక్షన్ సెంటర్ల నుంచి 1362.22 కోట్లతో డెయిరీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాము. గేదెపాలకు దొడ్ల డెయిరీ లీటరుకు రూ.32లు హెరిటేజ్ ప్రకాశం జిల్లాలో లీటరుకు రూ.34లు చెల్లిస్తోంది. ఈ రెండి చోట్ల రూ.39లు అమూల్ ద్వారా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ రూ.39లు ఇస్తే కడప జిల్లాలో లీటరుకు రూ.7లు, ప్రకాశం జిల్లాలో రూ.5లు పెరుగుతుందని కన్నబాబు తెలిపారు. ప్రకాశం జిల్లాలో సంగం డెయిరీ లీటరుకు రూ.58లు ఇస్తుంటే రూ.64.97లు ఇవ్వటానికి అమూల్‌ నిర్ణయం తీసుకుంది. రూ.6.97లు లీటరుకు అదనంగా వస్తుంది. చిత్తూరులో ఆవు పాలకు హెరిటేజ్ రూ.23.12లు చెల్లిస్తుంది. అమూల్‌ రూ.28లు చెల్లిస్తుంది. 
 
దీనివల్ల రూ.4.88 పైసలు అదనంగా రైతుకు రాబోతోంది. సంగం రూ.25.20పై ఇస్తోంది. అమూల్ రూ.28లు ఇస్తోంది. జెర్సీ డెయిరీ ఇచ్చిన దానికన్నా రూ.3.11పై లీటరుకు అదనంగా అమూల్ ఇవ్వబోతోందని కన్నబాబు వివరించారు. నిన్న బీబీసీలో రాష్ట్రంలో అమూల్ పాలసేకరణపై కథనం ప్రసారం చేశారు. సింగరాయకొండ మండలంలోని కల్కివాయ గ్రామంలో 230 రైతులకు రోజుకు రూ.4,200లు అదనంగా వస్తోంది.

అంటే నెలకు లక్ష పాతికవేలు అదనంగా వస్తోంది. అంటే 230 మంది రైతులకు సంవత్సరానికి పదిహేను లక్షలు అదనంగా వస్తోంది. ఇది జస్ట్ ట్రైల్‌ మాత్రమే అని కన్నబాబు అన్నారు. మన కళ్ల ముందు డెయిరీలు చనిపోయాయి. వ్యవస్థను తారుమారు చేశారు. ఇంత గట్టి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేయకపోతే ఎవ్వరూ సరిచేయలేరు. గుజరాత్ లాంటి చోట రైతాంగం బ్రహ్మాండంగా ఫలితాలు సాధిస్తూ బ్రతుకుతున్నారు అని మంత్రి కన్నబాబు స్పష్టం చేసారు.