శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 11 డిశెంబరు 2021 (17:09 IST)

బాలయ్య 'అఖండ' అలా వుందన్న చంద్రబాబు నాయుడు

నట సింహ బాలకృష్ణ నటించిన అఖండ చిత్రాన్ని చూసినట్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ సినిమా అద్భుతంగా వుందని కితాబు ఇచ్చారు.
 
అఖండ చిత్రం చూసినప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు నా కళ్ల ముందు కనిపించాయన్నారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు వున్నాయో అఖండ చిత్రంలో అవన్నీ చూపించారని, దర్శకుడు బోయపాటిని మెచ్చుకున్నారు.
 
కాగా అఖండ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లను వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం వారం రోజుల్లోనే రూ. 100 కోట్లకు దగ్గరగా వెల్తున్న బాలయ్య చిత్రంగా ముందుకు వెళుతోంది.