Daily Horoscope
✕

జగన్‌కు చిరంజీవి కృతజ్ఞతలు..ఎందుకో తెలుసా?

Written By ఎం
Updated: ఆదివారం, 24 మే 2020 (21:48 IST)
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మెగాస్టార్‌ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందుల్లో ఉన్న సినీ పరిశ్రమకు మేలు కలిగే నిర్ణయాలతో పాటు.. సింగిల్ విండో అనుమతులకు జీవో విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ మేరకు ఆదివారం సీఎం జగన్‌కు ఫోన్‌ చేశారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు కలుద్దామని సీఎం జగన్ చెప్పారని, అన్ని విభాగాల ప్రతినిధులతో త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తామని ట్విటర్‌ వేదికగా చిరంజీవి ప్రకటించారు.

కాగా సినీ పరిశ్రమల సమస్యలపై చర్చించేందుకు టాలీవుడ్‌ ప్రముఖులు శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనూ భేటీ అయిన విషయం తెలిసిందే.

లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన షూటింగ్స్‌ను కొనసాగించే విధంగా అనుమతులు ఇవ్వాలని కేసీఆర్‌ను కోరారు. దీనికి స్పందించిన కేసీఆర్‌ దశల వారీగా అనుమతులు ఇస్తామని తెలిపారు.

అన్నీ చూడండి

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్.. సంబరాల ఏటి గట్టు షూటింగ్ పూర్తి

Nivetha Pethuraj : వెంకటేష్, నివేదా పేతురాజ్‌పై మాలా.. పాట చిత్రీకరణ

Vijay and Rashmika: రియల్ జోడీ విజయ్ దేవరకొండ, ర‌ష్మిక మంద‌న్న‌ కెరీర్‌లో మైల్‌స్టోన్ గా రణబాలి

Riteish Deshmukh: రామ్ పోతినేని దర్శకత్వంలో రితేశ్ దేశ్‌ముఖ్ టాలీవుడ్ అరంగేట్రం

Rowdy Alludu 35: గీతా ఆర్ట్స్‌లో మెగా స్టార్ చిరంజీవి రౌడీ అల్లుడు 35 ఇయర్స్ సెలెబ్రేషన్స్

తర్వాతి కథనం
Show comments