Daily Horoscope
✕

రెండు బైకుల ఢీ: చిత్తూరు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Written By సెల్వి
Updated: శనివారం, 15 జనవరి 2022 (15:11 IST)
చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే ఇస్మాయిల్ (21), సిద్ధిక్ (21) అనే ఇద్దరు స్నేహితులు శుక్రవారం (జనవరి 15) రాత్రి మదనపల్లె నుంచి చంతపర్తి గ్రామానికి బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యలో ఓ చోట ఎదురుగా మరో బైక్ దూసుకురాగా రెండు బైక్స్ ఢీకొన్నాయి. 
 
ఈ ప్రమాదంలో ఇస్మాయిల్, సిద్ధిక్‌తో పాటు శ్రీనివాసులు (40) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు ప్రమాదాన్ని గుర్తించి 108 అంబులెన్స్‌కి సమాచారమిచ్చారు.
 
దీంతో అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని... వారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో శ్రీనివాసులు మార్గమధ్యలోనే మృతి చెందారు.

అన్నీ చూడండి

Priyadarshi : ఇడుపు కాయితం నుంచి గోగులు గోగులు లిరికల్ సాంగ్

లక్ష్మణుడు కథతో సరికొత్త ప్రయోగంగా ది లక్ష్మణ – అన్‌టోల్డ్ స్టోరీ

Keethy : కీర్తి సురేష్ -కృతిశెట్టి వదిన- మరదళ్ల డివికి డివికి డుక్కుం సాంగ్ వచ్చేసింది

Differences with Prasanth Varma :దర్శకుడితో విభేదాలు - హనుమాన్ ఫ్రాంచైజీ రెండు వేర్వేరు గా విడిపోయింది

డెహ్రాడూన్ ఐఎస్‌బిటి ఘటన స్ఫూర్తితో అన్‌ఎక్స్‌పెక్టెడ్ – సఫేద్ సచ్ చిత్రం ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments