శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

ఏపీలో కొత్తగా మరో 4,528 కోవిడ్ పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 4,528 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ కొత్త కేసులతో కలుపుకుంటే ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,93,860కు చేరింది. ఇందులో 20,61,039 మంది ఈ వైరస్ నుంచి విముక్తిపొందారు. 
 
అలాగే, ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ వైరస్ బారినపడిన వారిలో 14,508 మంది మరణించారు. అలాగే, రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 18,313గా ఉన్నాయి. గత 24 గంటల్లో 418 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 
 
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో గడిచిన 24 గంటల్లో అనంతపురంలో 300, చిత్తూరులో 1,022, ఈస్ట్ గోదావరిలో 327, గుంటూరులో 337, కృష్ణాలో 166, కడపలో 236, కర్నూలులో 164, విశాఖపట్టణంలో 992, శ్రీకాకుళంలో 385 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.