సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

పరిటాల శ్రీరామ్‌కు కరోనా పాజిటివ్

తెలుగుదేశం పార్టీ యువ నేత పరిటాల శ్రీరామ్ కరోనా వైరస్ సోకింది. ఆయనలో స్వల్ప లక్షణాలతో తనకు కరోనా పాజిటివ్ తేలిందని చెప్పారు. అందువల్ల తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. పైగా, ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని తెలిపారు. 
 
మరోవైరు దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఈ నెల 18వ తేదీ నుంచి ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయనున్నారు. 
 
తెలంగాణా రాష్ట్రంలో లాక్డౌన్?
దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. అలాగే, తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరిగిపోతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఆస్క్ కేటీఆర్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. తమ సుస్థిర, సుపరిపాలనే భారతీయ జనతా పార్టీ విద్వేష ప్రచారానికి తమ సమాధానమని అన్నారు. 
 
కొత్తగా 2.64 లక్షల కేసులు 
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరుకుంది. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో కోవిడ్ కేసుల పెద్ద ఎత్తున వెలుగు చూస్తున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,64,202 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఎనిమిది నెలల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ఇకపోతే, దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 5,753కి పెరిగిపోయింది. నిన్నటితో పోల్చితే ఈ కేసుల పెరుగుదలలో 4.83 శాతం పెరుగుదల కనిపించింది. దేశంలో నమోదైన తాజా కేసులతో కలుపుకుంటే 12,72,073కు చేరింది. ఈ కేసుల ఇంకా క్రియాశీలంగా ఉండగా, రోజువారీ పాజిటివ్ రేటు 14.78 శాతంగా ఉంది. 
 
దేశంలో కరోనా వైరస్ మళ్ళీ ప్రతాపం చూపిస్తుండటంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి రోజున ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్‌లోని గంగానదిలో భక్తుల పుణ్యస్నానాలపై నిషేధం విధించింది. 
 
భాజపా విషపూరిత అజెండాను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారని, తెలంగాణ కోసం ఎవరు పనిచేస్తున్నారో ప్రజలకు బాగా తెలుసన్నారు. పలు అంశాలపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఇలా అనేక ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 
 
అంతేకాకుండా, కరోనా కేసులు, వైద్య ఆరోగ్య శాక సలహాల మేరకు రాష్ట్రంలో లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ వంటి నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయని, కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. అయితే, లాక్డౌన్ మాత్రం విధించే అవకాశాలు మాత్రం తక్కువగా ఉన్నాయని తెలిపారు.