శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

శ్రీవారిసేవలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ

nvramana
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ దర్శనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సుప్రభాతం, అభిషేక సేవలో పాల్గొన్నారు. 
 
జస్టిస్ ఎన్వీ రమణతో కలిసి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కూడా శ్రీవారిని దర్శనం చేసుకున్నవారిలో ఉన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌కు ఆలయన వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రాన్ని బహుకరించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.