తన కాళ్ళకు మొక్కిన వ్యక్తికి షాకిచ్చిన సీఎం చంద్రబాబు (Video)
తన కాళ్లు మొక్కిన వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు షాకిచ్చారు. తన పాదాలకు నమస్కరించిన వ్యక్తి పాదాలను చంద్రబాబు తాకారు. దీంతో మంత్రి నారాయణతో పాటు అక్కడున్నవారంతా ఒకింత షాక్‌కు గురయ్యారు.
తన కాళ్లకు మొక్కేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే తిరిగి తాను కూడా అదే పని చేస్తానంటూ గతంలో చంద్రబాబు పలుమార్లు చెప్పారు. ఇపుడు అన్నంత పనీ చేశారు. రాజధాని అమరావతిలోని సీఆర్డీయే కార్యాలయ నిర్మాణ పనులను ఆయన శనివారం ప్రారంభించేందుకు వచ్చిన సీఎం చంద్రబాబు పాదాలను తాకి ఓ వ్యక్తి నమస్కరించారు. దీనికి వెంటనే స్పందించిన చంద్రబాబు.. నన్ను కూడా మీ కాళ్ళకు నమస్కారం చేయమంటారా? అని ఆ వ్యక్తి కాళ్లు పట్టుకునేందుకు వంగారు. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాకయ్యారు.
తనక కాళ్ళకు ఎవరూ నమస్కారం చేయొద్దని, తల్లిదండ్రులు, గురువులు పాదాలకు మాత్రమే నమస్కారం చేయాలని చంద్రబాబు పదేపదే చెబుతూ వస్తున్నారు. ఎవరైనా తన కాళ్లకు నమస్కరించే ప్రయతద్నం చేస్తే తాను కూడా అదే పని చేస్తానని ఇటీవల చంద్రబాబు హెచ్చరించిన విషయం తెల్సిందే.