గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 మే 2022 (13:38 IST)

దావోస్‌లో బిజీగా గడుపుతున్న ఏపీ సీఎం జగన్

ys jagan - adani
దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక మండలి సదస్సులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి రెండో రోజైన సోమవారం బిజీగా గడుతున్నారు. ఈ సదస్సులో భాగంగా ఆయన ఆదివారం ఏపీ పెవిలియన్‌ను ప్రారంభించి పలువురు కీలక పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు. 
 
రెండో రోజైన సోమవారం కూడా మరికొందరు పెట్టుబడిదారులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకునిరావడమే లక్ష్యంగా ఆయన అక్కడ కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా, ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీలు సీఈవోలతో సమావేశమవుతున్నారు. 
 
అలాగే, ఫ్యూచర్ ఫ్రూఫింగ్ హెల్త్ సిస్టమ్ అంశంపై సదస్సులో ఆయన మాట్లాడనున్నారు. స్విట్జర్లాండ్ కాలమానం ప్రకారం ఇది ఉద.యం 8.15 గంటలకు ప్రారంభంకానుంది. ఆ తర్వాత ఆయన టెక్ మహీంద్రా ఛైర్మన్, సీఈవో సీపీ గురానీతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఆ తర్వాత దస్సాల్ట్ సీఈవో బెర్నార్డ్ ఛార్లెస్‌తోను, ప్రముఖ రవాణా సంస్థ ఓస్కే లైన్స్ లిమిటెడ్ సీఈవో తకేషి హషిమొటోతో భేటీ అవుతారు.