గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (10:58 IST)

విశాఖలో 27న సీఎం జగన్ పర్యటన..

ఏపీ సీపీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖలో 27న పర్యటించనున్నారు. మిలాన్-2022 యుద్ధనౌకల సమాహారంలో భాగంగా నిర్వహించే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆదివారం మ.2.30 గంటలకు విశాఖకు చేరుకుంటారు.
 
ఆ తర్వాత నావల్‌ డాక్‌యార్డ్‌కు వెళ్లి అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఐఎన్‌ఎస్‌ వేలా సబ్‌మెరైన్‌ సందర్శిస్తారు. అక్కడి నుంచి ప్రభుత్వ సర్క్యూట్‌ హౌస్‌కు వెళ్తారు. 
 
సాయంత్రం 5.30 గంటలకు ఆర్‌కే బీచ్‌కు చేరుకుని ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ మిలాన్‌–2022లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు.