శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (11:31 IST)

కొత్త లబ్దిదారులకు సంక్షేమ నిధులు విడుదల : గుడ్‌న్యూస్ చెప్పిన సర్కారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన సంక్షేమ పథకాలను అమలుచేస్తుంది. ఇందుకోసం అర్హులైన లబ్దిదారులను వివిధ రకాలైన వడపోత ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో కొత్తగా ఎంపికైన లబ్దిదారులకు సంబంధించిన సంక్షేమ పథకాల నిధులను మంగళవారం విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేస్తారని తెలిపింది. 
 
వివిధ సంక్షేమ పథకాలకు రూ.3,39,096 మంది లబ్దిదారులను ఎంపిక చేసినట్టు పేర్కొంది. వారందరికీ మంగళవారం నిధులు మంజూరు చేయనున్నారు. వీరిలో పెన్షన్లు, బియ్యం కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డుల కోసం లబ్దిదారులను ఎంపిక చేశారు. ఈ పథకాల కోసం 935 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తారు. 
 
మంగళవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నగదును జమచేస్తారు. మరోవైపు, వైఎస్ఆర్ కాపు నేస్తం నిధులను జూలై 22వ తేదీన జగనన్న తోడు నిధులను జూలై 26వ తేదీన విడుదల చేస్తామని రాష్ట్ర మంత్రివర్గం వెల్లడించింది.