గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 జులై 2022 (09:05 IST)

నేడు TSPolycet పరీక్షా ఫలితాల వెల్లడి

తెలంగాణా రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో డిప్లొమా ఇన్‌ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ పాలిసెట్ పరీక్షా ఫలితాలను బుధవారం వెల్లడించనున్నారు.
 
వీటిని నాంపల్లిలోని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ నవీన్ మిట్టల్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి విడుదల చేయనున్నారు. 
 
జూన్ 30వ తేదీన ఈ పాలిసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించగా, మొత్తం 1,04,432 మంది విద్యార్థులు హాజరయ్యారు.