మంగళవారం, 27 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 జులై 2022 (17:31 IST)

తెలంగాణ పాలిసెట్‌ 2022 ఫ‌లితాలు- జూలై 13న విడుదల

students
10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్‌ కాలేజీల్లో డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి ఈ పాలిటెక్నిక్‌ కామన్ ఎంట్ర‌న్స్ టెస్ట్‌ (TS POLYCET Results)ను నిర్వ‌హిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో వ‌చ్చిన ర్యాంక్‌ ఆధారంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. 
 
తెలంగాణ పాలిసెట్‌ 2022 ఫ‌లితాల‌ను జూలై 13వ తేదీ (రేపు)  విడుదల చేయనున్నారు. బుధవారం ఉదయం 11.30 లకు విడుదల చేస్తారు.

తెలంగాణ రాష్ట్ర సాంకేతిక, శిక్షణ విద్యా మండలి ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. పరీక్షా ఫలితాలను https://polycetts.nic.in/ అనే వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.