శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 15 జులై 2019 (12:24 IST)

17 నుంచి జగన్ అమెరికా పర్యటన.. ఫ్యామిలీతో కలిసి...

ఈ నెల 17వ తేదీ నుంచి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన 23వ తేదీ వరకు అమెరికాలో పర్యటిస్తారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విదేశీ పర్యటనకు వెళుతున్నారు. 
 
ఈ సందర్భంగా డెట్రాయిట్ నగరంలో ప్రవాసాంధ్రులు నిర్వహించే ఆత్మీయసభలో జగన్ పాల్గొంటారు. కాగా, ముఖ్యమంత్రి అయ్యాక జగన్ చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. కాగా, జగన్ కుమార్తెలు విదేశాల్లో చదువుతున్న విషయం తెల్సిందే. జగన్ ప్రమాణ స్వీకారానికి వారు కూడా అమరావతికి వచ్చిన విషయం తెల్సిందే.