సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

ప్రజలు అసత్యాలను నమ్మే స్థితిలో లేరు : అచ్చెన్న

పదేపదే అసత్యాలు చెబితే ప్రజలు నమ్ముతారని అనుకోవద్దని టీడీపీ శాసనసభ ప్రతిపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతిపక్ష సభ్యులను హేళన చేస్తూ మాట్లాడటం మంచి పద్దతా? అని ప్రశ్నించారు. శాసనసభలోని మీడియా పాయింట్‌ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. 
 
రుణమాఫీ కింద మూడు విడతలుగా రూ.15 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. రుణమాఫీ చేయలేదని అసత్యాలు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తమ హయాంలో ప్రజలకు ఏం చేశామో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 
 
మరో ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. వడ్డీలేని రుణాలు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని జగన్‌ సవాల్‌ చేశారని, ఇవాళ రూ.630 కోట్లు చెల్లించారని ఆయనే చెబుతున్నారని అన్నారు. మాట వరసకు మాత్రమే చెప్పానని జగన్‌ చెప్పడం మంచి పద్ధతా అని ప్రశ్నించారు.
 
'రాజీనామా చేయాల్సింది ఎవరో తెలిసిపోయింది. అవినీతిలో కూరుకున్న వ్యక్తులు అసత్యాలే చెబుతారు. మడమ తిప్పని నాయకుడే అయితే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం.. అంతిమ నిర్ణేతలు ప్రజలే' అని బుచ్చయ్య చౌదరి అన్నారు.