సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 12 జులై 2019 (11:29 IST)

పర్సనాలిటీ పెరిగితే సరిపోదు.. బుద్ది పెరగాలి : అచ్చెన్నకు జగన్ వార్నింగ్

ఏపీ అసెంబ్లీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా శుక్రవారం అధికార, విపక్ష పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన సున్నా వడ్డీ రుణాలపై పార్టీల మధ్య మొదలైన మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. 
 
ఇదే అంశంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రసంగాన్ని మొదలుపెట్టగానే టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. దీంతో టీడీపీ సభ్యులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్.. అసెంబ్లీలో మీ బలం ఎంత.. మా బలం ఎంతా అని ప్రశ్నించారు. 
 
అసెంబ్లీలో తాము 150 మంది ఉన్నామన్న ఆయన.. మేం తలుచుకుంటే సభలో ఒక్కరూ మాట్లాడలేరని హెచ్చరించారు. అంతేకాదు ప్రతిపక్షం బుద్ధిలేకుండా వ్యవహరిస్తున్నారని.. 'పర్సనాలిటీ పెరిగితే సరిపోదు.. బుద్ది పెరగాలి' అంటూ జగన్ మండిపడ్డారు. కాగా ఈ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.