బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 9 జులై 2019 (18:39 IST)

తెలంగాణ హామీలు అమలు చేయండి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్రపతి ప్రసంగంలో బడ్జెట్‌లో తెలంగాణ అంశాలు లేకపోవడం విచారకరమని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ జీరో హావర్‌లో ఉత్తమ్.. ఎన్నో ఆశలు, ఆశయాలతో సాధించుకున్న తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం విచారకరమని నల్గొండ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 
 
మంగళవారం ఆయన పార్లమెంట్ జీరో హవర్‌లో తెలంగాణ విభజన చట్టంలోని హామీలపై మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగంలో కానీ, కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో కానీ తెలంగాణ హామీలపై ప్రస్తావించలేదని ఇది చాలా విచారకరమన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారంలో ఇనుము పరిశ్రమ కానీ, గిరిజన విశ్వవిద్యాలయం కానీ ఏ ఒక్కటి అమలు కాలేదని అన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణకు అనేక హక్కులు, హామీలు ఇచ్చారని ఐదేళ్లు అవుతున్న అవి అమలు కాలేదని వీటిపైన ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని అన్నారు.