సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 8 మే 2020 (21:35 IST)

ఎల్జి పాలిమర్స్ ప్రతినిధులతో సీఎస్ భేటీ

ఎల్జి పాలిమర్స్ పరిశ్రమలో ఎన్ని ట్యాంకులు ఉన్నాయి, వాటిలో కెమికల్స్ వివరాలు, వాటి పరిస్థితి, ఉష్ణోగ్రత, పారామీటర్స్ వివరాల గురించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సహాని కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్,పోలీసు కమిషనర్ ఆర్. కె. మీనా లతో కలసి ఎల్జి పాలిమర్స్ కంపెనీ ప్రాంగణంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. మిగిలిన ట్యాంకుల ఉష్ణోగ్రత, పాలిమర్ కంటెంటు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కంపెనీ పరిసర వాతావరణంలో రసాయనాల పరిస్థితి, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి తీసుకొనవలసిన చర్యలను గురించి చర్చించారు.

ట్యాంకులలో ఉష్ణోగ్రతలు, పాలిమరై జేషన్ కంటెంటు వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ట్యాంకులలో కెమికల్ రియాక్షన్ తగ్గించి సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి కంపెనీ సాంకేతిక నిపుణులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. కంపెనీ అధికారులు సాంకేతిక నిపుణులు ఈ విషయంపై స్పష్టతతో పనులు నిర్వహించాలని, వాటి వివరాలను తెలియజేయాలన్నారు.

జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ ఫ్యాక్టరీలలో పరిస్థితులపై వివరాలను చర్చించారు. ట్యాంకుల  పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సమావేశంలో పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా, పరిశ్రమల శాఖ డైరెక్టర్ గణపతి, కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ప్రసాద్, జాయింట్ చీఫ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వర్మ, ఎన్డిఆర్ఎఫ్ నిపుణులు తదితరులు పాల్గొన్నారు.