శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 8 మే 2020 (21:28 IST)

ఎల్.జి. పాలిమర్స్ లో దుర్ఝటన.. 554 మందికి చికిత్స: ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని

ఎల్.జి. పాలిమర్స్ దుర్ఝటన నుండి కోలుకున్నంత వరకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాశీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) వెల్లడించారు. 

శుక్రవారం ఎల్.జి. పాలీమర్స్ దుర్ఝటనకు గురైన ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కె.జి.హెచ్.లో ఆయనతో పాటు జిల్లా ఇన్ చార్జ్ మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, రాష్ట్ర మున్సిపల్, పరిపాలన శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మలూరి జయరాం, రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ధర్మాన  కృష్ణ దాసు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్ఝటన జరిగిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు.  వెనువెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకున్నందు వలన పెను విపత్తు నుండి బయటపడినట్లు ఆయన స్పష్టం చేశారు. 

ఎల్.జి. పాలిమర్స్ కు దగ్గరలో ఉన్న 5 గ్రామాలలో సుమారు 15 వేల మంది జనాభా ఉన్నారన్నారన్నారు.  విపత్తు జరిగిన గంటలోనే పోలీసులు, రెవెన్యూ, వైద్య బృందాలు, తదితరులు అక్కడకు చేరుకొని తగు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.  ప్రతి ఇంటి తలుపులు తట్టి ఇళ్లల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలు, అవసరమైన వారిని ఆసుపత్రులకు తరలించడమైన్నారు. 

ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వలన పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.  స్టెరీన్ గ్యాస్ కు గురై ఆసుపత్రిలో ఉన్న వారిని ముఖ్యమంత్రి పరామర్శించడం జరిగిందని, అప్పటికే 375 మంది బాదితులు ఉన్నట్లు చెప్పారు.  ప్రస్తుతం దాదాపు ఆసుపత్రల్లో 554 మంది చికిత్స పొందుతున్నారని, 128 మంది పూర్తి ఆరోగ్యంతో కోలుకొని ఈ రోజు డిస్చార్జ్ అయినట్లు చెప్పారు. 

డిస్చార్జ్ అయిన వారు ఆయా గ్రామాలకు వెల్లకుండా సురక్షితమైన వారి బందువులు గృహాలకు వెళ్లమని చెప్పినట్లు పేర్కొన్నారు.  305 మంది కెజిహెచ్ లో చికిత్స పొందుతున్నారని, ఇందులో 52 మంది చిన్న పిల్లలు వార్డులో చికిత్స పొందుతున్నారని, 253 మంది పెద్ద వారు వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.   వైద్యాధికారులు అప్రమత్తమై అవసరమైన వారికి తగు వైద్యం అందించడం వలన అందరూ సురక్షితంగా ఉన్నారని, ఏ ఒక్కరికి ప్రమాదం లేదని, ఎవరూ వెంటిలేర్ పై లేరని తెలిపారు. 

121 మంది కేర్, అపోలో, ఓమిని ఆర్క్కె, తదితర ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.  అందరూ బాగున్నారని, ఎవరికీ ప్రాణాపాయ స్థితి లేదన్నారు.  అందరూ సురక్షితంగా ఉండాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.  ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారు ఎవరూ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు.  కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటామని తెలిపారు. 

ప్రజలందరూ సహకరించాలని, పాలిమర్స్ పరిసర ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా ఉండాలన్నారు.  అధికారులు మీ మీ గ్రామాలకు వెల్లమని చెప్పినంత వరకు వెల్లవద్దని చెప్పారు.  ముఖ్యమంత్రి ప్రకటించిన ఆర్థిక సహాయం బాధితులందరికి అందుతుందని, ఈ విపత్తు నుండి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.  ఆ ప్రాంతంలో గ్యాస్ లీక్ కు సంబంధించి లక్షణాలు ఎవరిలోనైనా  ఉంటే దగ్గరలోనే సిహెచ్సి, పిహెచ్సి లు ఏర్పాటు చేయడమైనదని అక్కడకు వెళ్లి వైద్యులకు చూపించుకోవాలని చెప్పారు. 

ఈ దుర్ఝటనపై ఉన్నత స్థాయి సర్వే జరుగుతుందని, నిపుణుల కమిటీ వస్తుందన్నారు.  ఎల్.జి. గ్యాస్ లీకేజ్ దుర్ఝటన జరిగిందని, అందుకు ప్రజలందరి సహకారం ఉంటేనే సత్ఫలితాలు ఉంటాయన్నారు.  
 
అంతకు ముందు ఎల్.జి. పాలీమర్స్ దుర్ఝటనకు గురైన బాదితులను కెజిహెచ్ ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులను మంత్రుల బృందం పరామర్శించి, అందరూ ఆరోగ్యంగా ఉన్నారని, ఏ ఒక్కరికి ప్రాణాపాయం లేదని కెజిహెచ్ పర్యవేక్షకులు డా. అర్జున్ మంత్రులకు వివరించారు.  శ్వాస సరిగా అందుతున్నది లేనిది, తదితర వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  

ఈ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు బివి సత్యవతి, అనకాపల్లి శాసన సభ్యులు గుడివాడ అమర్ నాథ్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్, ఎఎంసి ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, విమ్స్ సంచాలకులు డా. కడలి సత్య వర ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్. తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.   

అనంతరం సుజాత నగర్ లో బాధితులకు ఏర్పాటు చేసిన రిలీఫ్ కేంప్ ను మంత్రులు సందర్శించి భోజన ఏర్పాట్లను పరిశీలించారు.  మా గృహాలకు వెళతామని బాధితులు మంత్రులను అడుగగా అధికారులు వెల్లమని ఎప్పుడు చెబుతారో అప్పుడే మీ గ్రామాలకు వెళ్లాలని బాధితులకు వివరించారు.  ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు జివిఎంసి కమీషనర్ డా. జి. సృజన, జాయింట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్, జివియంసి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.