శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 మార్చి 2022 (17:12 IST)

వైకాపాపై నమ్మకం పోయింది.. రాష్ట్రానికి పెద్ద దిక్కుకావాలి : పురంధేశ్వరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అధికార వైకాపాపై ఉన్న నమ్మకం పోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి పెద్ద దిక్కు కావాలని బీజేపీ మహిళా నేత పురంధేశ్వరి అన్నారు. విశాఖ వేదికగా బీజేపీ రాష్ట్ర శాఖ సమావేశం జరిగింది. ఇందులో ఆమె పాల్గొని ప్రసంగిస్తూ, వైకాపా పాలనపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపు కార్యకర్తల సమిష్టి కృషి అని కార్యకర్తలను విశ్వసించే పార్టీ బీజేపీ ఒక్కటేనని చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లో లభించిన విజయం స్ఫూర్తితో ఏపీలోని బీజేపీ శ్రేణులు, నాయకులు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి పార్టీ బలోపేతం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అంతేకాకుండా, వైకాపా పాలన తప్పులను ప్రజలు ఎత్తి చూపాలని ఆమె పిలుపునిచ్చారు. 
 
ప్రస్తుతం ఏపీ అప్పులాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే సమాయానికి రాష్ట్ర అప్పులు రూ.2 లక్షల కోట్లు ఉండగా ఇపుడు అది ఆరున్నర లక్షల కోట్ల రూపాయలకు చేరిందన్నారు. అంటే ఏపీలోని ప్రతి ఒక్క పౌరుడిపై రూ.1.2 లక్షల రుణభారం ఉందని ఆమె వివరించారు.