శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 మార్చి 2022 (10:45 IST)

రాజధాని అవసరాల నిమిత్తం రూ.1329.21 కోట్లు కేటాయింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అవసరాల నిమిత్తం రూ.1329.21 కోట్లను కేటాయించింది. అలాగే, కేంద్రం కేటాయించిన రూ.800 కోట్ల నిధులతో రాజాధాని నిర్మాణం చేపడుతామని పేర్కొంది. 
 
రాజధాని గ్రామాల్లోని పేదల కోసం క్యాపిటల్ రీజియన్ సోషల్ సెక్యూరిటీ ఫండ్ నిత్తం రూ.121.11 కోట్లను కేటాయించింది. రాజధాని రైతులకిచ్చే కౌలు చెల్లింపుల కోసం రూ.208 కోట్లను కేటాయించింది. అలాగే రాజధాని రాజధాని గ్రీనరీ, ఎల్ఈడీ బల్బుల నిర్వహణ శానిటైజేషన్, కరకట్ట విస్తరణకు అవసరమైన భూసేకరణ నిమిత్తం మరో రూ.200 కోట్లను కేటాయించినట్టు ప్రభుత్వం తెలిపింది. 
 
ఇదిలావుంటే, ఏపీ రాజధాని అమరావతే అంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ఏపీ సర్కారు కేవియట్ పిటిషన్లను దాఖలు చేసింది. ఈ పిటిషన్లను శుక్రవారం సుప్రీంకోర్టు స్వీకరించింది. హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు వస్తే తమ వాదనలు వినకుండా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని ఈ కేవియట్ పిటిషన్లలో ప్రభుత్వం పేర్కొంది. 
 
కాగా, అమరావతి రాజధానికి సంబంధించి మరో చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని న్యాయస్థానం తేల్చి చెప్పిన సంగతి తెల్సిందే. అయితే, హైకోర్టు తీర్పుతో నిమిత్తం లేకుండా త్వరలోనే మూడు రాజధానానుల బిల్లు తెస్తామని సీఎం జగన్ సర్కారు పదేపదే చెబుతోంది.