శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (11:34 IST)

ఒక వైపు కరోనా.. మరోవైపు వైరల్ జ్వరాలు.. హైదరాబాదీలు జాగ్రత్త

ఒక వైపు కరోనా.. మరోవైపు వైరల్ జ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో వైరల్ జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అందులో డెంగ్యూ జ్వరాల భారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుండి ఈనెల 18వ తేదీ వరకు రాష్ట్రంలో మొత్తం 3వేలకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అందులో 1800 కేసులు హైదరాబాద్ నగరంలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
 
ఇక ఖమ్మం లోనూ డెంగ్యూ కేసుల సంఖ్య అధికంగానే నమోదు అవుతోందని అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా హైదరాబాద్‌లో ప్రతి వంద ఇళ్లలో 17 ఇళ్లలో డెంగ్యూ దోమలు ఉన్నట్టు అధికారులు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. కాబట్టి ఇంట్లో దోమలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అని అధికారులు సూచిస్తున్నారు. ఇంట్లో మరియు చుట్టు పక్కల పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తున్నారు.