గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

రోడ్డు ప్రమాదం కాదు.. నేనే ఢీకొట్టా : దివ్వెల మాధురి (Video)

divvela madhuri
తాను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంపై దివ్వెల మాధురి స్పందించారు. తాను ప్రయాణిస్తూ వచ్చిన కారు ప్రమాదానికి గురికాలేదన్నారు. అందువల్ల ఇది ప్రమాదం కాదని చెప్పారు. ఆత్మహత్య చేసుకునేందుకు లారీని ఢీకొట్టబోయి రోడ్డుపక్కన ఉన్న కారును ఢీకొట్టానని తెలిపారు. వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆయన భార్య దువ్వాడ వాణి చేసిన, చేస్తున్న ఆరోపణలను భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించి ఇలా చేశానని తెలిపారు. పైగా, తనకు వైద్యులు చికిత్స చేయవద్దని కోరారు. తనకు చనిపోవాలని ఉందన్నారు. అయితే, కొందరు ప్రత్యక్ష సాక్షులు మాత్రం దివ్వెల మాధురి పీకల వరకు మద్యం సేవించి కారు నడిపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు. 
 
ఒకే ఇంట్లో ఉంటున్నాం.... శారీరకంగా కలిశాం : దువ్వాడ శ్రీనివాస్ 
 
భరత నాట్య శిక్షకురాలు దివ్వెల మాధురి తాను ఒకే ఇంట్లో ఉంటున్నామని, శారీరకంగా కూడా కలిశామని వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. దీన్న అడల్టెరీ రిలేషన్ అంటారని ఆయన చెప్పారు. ఇలా ఉండకూడదని సుప్రీంకోర్టు కూడా ఎక్కడా.. ఎపుడూ చెప్పలేదన్నారు. అదేసమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్లి చేసుకోవాడాని పరిస్థితి ఏంటో ఇపుడు తనకు అర్థమవుతుందన్నారు. గతంలో ఆయనపై కామెంట్స్ చేసిన మాట నిజమేనని, ఇపుడు పరిస్థితి తన వద్దకు వస్తేగానీ బోధడపటం లేదన్నారు. అదేసమయంలో మాధురి తనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందన్నారు. అందుకు ఆమెతో శారీరకంగా కలిశానని, ఈ విషయంలో తాను అబద్ధం చెప్పడం లేదన్నారు.
 
ఆగివున్న కారును ఢీకొట్టిన దివ్వెల మాధురి 
 
వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస రావు - దివ్వెల మాధురి వ్యవహారం గత కొన్ని రోజులుగా మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తనకు మాధురికి మధ్య వున్న సంబంధం అడల్ట్రీ రిలేషన్ అంటూ దువ్వాడ చెప్పుకొస్తున్నారు. ఐతే దీనిపై దువ్వాడ భార్య వాణి తన భర్తపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మాధురి తన భర్తను వలలో వేసుకున్నదనీ, ఆమె గురించి పలాసలో అందరికి తెలుసునని అన్నారు.
 
ఈ దుమారం ఇలా జరుగుతుండగానే ఆదివారం మధ్యాహ్నం పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్ సమీపంలో ఆగి వున్న కారును దివ్వెల మాధురి కారు ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మాధురికి చిన్నపాటి గాయం కూడా కాలేదు. కనీసం శరీరంపై ఓ గీత కూడా పడలేదు. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె జూమ్ కాల్ మాట్లాడుతుండగా, కారు బోల్తా పడింది. కారు మాత్రం దెబ్బతినగా, కారులో ఉన్న ఆమెకు మాత్రం రవ్వంత గాయం కూడా కాకపోవడం గమనార్హం. 
 
అయినప్పటికీ ఆమె ఆమె ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిపడకపై నుంచే మాధురి విలేకరులతో మాట్లాడుతూ.. దువ్వాడ శ్రీనివాస రావు భార్య వాణి తనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తోందనీ, తన పిల్లలపై దారుణమైన వ్యాఖ్యలు చేసిందనీ, ఆమెపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. తన పిల్లలపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన ఆమెను తక్షణమే అదుపులోకి తీసుకోవాలనీ, లేదంటే తను ఆత్మహత్య చేసుకుంటానంటూ మీడియాతో చెప్పారు. ప్రస్తుతం తను డిప్రెషన్లో వున్నాననీ, ట్రోల్స్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని కారుతో ఢీకొట్టినట్లు వెల్లడించారు.