1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (10:12 IST)

పులిచింతల ప్రాజెక్టు సమీపంలో భూకంపం .. కొన్ని సెకన్లపాటు ప్రకంపనలు

earthquake
ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడులో ఉన్న పులిచింతల ప్రాజెక్టు సమయంలో ఆదివారం ఉదయం భూప్రకంపనలు కనిపించాయి. ఈ ప్రాంతంలో ఆదివారం ఉదయం 7.26 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు ఈ ప్రకంపనలు కనిపించాయి. ముఖ్యంగా, అచ్చంపేట మండలం మాదిరిపాడు, చల్లగరిక, గింజపల్లి తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కనిపించింది. దీంతో పులిచింత ప్రాజెక్టు సమీప గ్రామాల ప్రజలు భయంతో వణికిపోయారు. 
 
మళ్లీ భూప్రకంపనలు వస్తాయేమోనన్న భయంతో వారు ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతూ రోడ్డుపైనే కూర్చొనివున్నారు. అయితే, అది స్వల్ప భూకంపమేనని, భయపడాల్సిన పనిలేదని నిపుణులు చెబుతున్నారు. అదేసమయంలో ఈ భూప్రకంపనలపై సమాచారం అందుకున్న అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు.