1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2023 (13:14 IST)

పల్నాడు జిల్లాలో దారుణం.. తెదేపా నేతపై దుండగుల కాల్పులు

gunshot
పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. తెలుగుదేశం పార్టీకి చెందిన మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ అయిన బాలకోటిరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు గురువారం ఉదయం కాల్పులకు తెగబడ్డారు. ఆయన ఇంట్లోకి ప్రవేశించి మరీ ఈ కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 
ఈ కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న టీడీపీ నేత చదలవాడ అరవిందబాబు ఆస్పత్రికి వెళ్లి బాలకోటిరెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మరోవైపు, ఈ కాల్పులు గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించే పనిలో నిమగ్నయ్యారు.