సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 26 నవంబరు 2021 (19:00 IST)

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్క నాటిన పూజా హెగ్డే

కుర్ర‌కారు గుండెల్లో మేడ‌మ్... గుబులు పుట్టుంచే పూజా హెగ్డే సామాజిక కార్య‌క్ర‌మాల్లో కూడా పాల్గొంటోంది.  “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో, టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన  పూజాహెగ్డే రామోజీ ఫిల్మ్ సిటీలో శుక్రవారం మొక్కను నాటారు. అనంతరం, బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముక్ కి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” చేస్తున్నట్టు తెలిపారు.
 
 
హీరోయిన్ పూజా హెగ్డే మాట్లాడుతూ “గ్రీన్ ఇండియా చాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ “గ్రీన్ ఇండియా చాలెంజ్” గ్లోబల్ వార్మిగ్ ని అరికట్టడానికి దోహదపడుతుంది. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుంది. అందుకే  ప్రతి ఒక్కరు బాధ్యతగా “గ్రీన్ ఇండియా చాలెంజ్”లో పాల్గొని మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను. “గ్రీన్ ఇండియా చాలెంజ్” కో ఫౌండర్ రాఘవ పాటు తదితరులు పాల్గొన్నారు.