గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 14 నవంబరు 2020 (21:54 IST)

హత్యను సీఎం జగన్ దృష్టి తీసుకెళ్తాం: రామసుబ్బారెడ్డి

పి.అనంతపురంలో గురునాథ్‌ రెడ్డి మృతదేహాన్ని మాజీమంత్రి రామసుబ్బారెడ్డి సందర్శించారు. అనంతరం గురునాథ్‌ రెడ్డి కుటుంబాన్ని రామసుబ్బారెడ్డి పరామర్శించారు. గండికోట నిర్వాసితుల పరిహారం విషయంలో హత్య చేశారని, ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టి తీసుకెళ్తామని చెప్పారు. పి.అనంతపురంలో అర్హులందరికీ పరిహారం ఇప్పిస్తామని రామసుబ్బారెడ్డి చెప్పారు. ఓకే జాగ్రత్త
 
జమ్మలమడుగు ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పి. అనంతపురం గ్రామానికి గురునాధ్ రెడ్డి మృతదేహం చేరుకుంది. ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో భారీగా పోలీసు బలగాలు మోహరించింది. శుక్రవారం ఎమ్మల్యే సుధీర్ రెడ్డి వర్గీయుల చేతిలో రామసుబ్బారెడ్డి అనుచరుడు గురునాధ్ రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో గ్రామం మొత్తం నివురు గప్పిన నిప్పులా మారిపోయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.