సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 మార్చి 2023 (15:23 IST)

నంద్యాల జిల్లా గ్రామంలో పులి పిల్లలు.. పెద్దపులి వస్తుందా?

Tiger
Tiger
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని ఓ గ్రామ సమీపంలో స్థానికులు నాలుగు పులి పిల్లలను కనుగొన్నారు. పెద్ద గుమ్మడాపురం గ్రామస్థులు ఆదివారం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో పిల్లలను గుర్తించారు. 
 
కుక్కల బెడద భయంతో పులి పిల్లలను గ్రామంలోని ఓ ఇంట్లోకి తరలించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పిల్లలను వెతుక్కుంటూ ఆ ప్రాంతానికి పెద్దపులి వస్తుందేమోనన్న భయం గ్రామస్తుల్లో నెలకొంది. 
 
ఈ గ్రామం ఆత్మకూర్ అటవీ డివిజన్ అంచున ఉంది. స్థానికుల సమాచారం మేరకు పులిపిల్లలను తమ ఆధీనంలోకి తీసుకున్న అటవీ అధికారులు, పులి తన పిల్లలను వదిలి ఆహారం కోసం వెళ్లి ఉండవచ్చని చెప్పారు. పులి పిల్లల పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.
 
పులి జాడ కోసం అటవీ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. పెద్దపులిని కనిపెట్టి ఆ పులి వద్ద పిల్లలను వదిలేయాలని అటవీశాఖాధికారులు యోచిస్తున్నారు.