శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 8 జనవరి 2022 (10:54 IST)

ప‌ద్మావ‌తీ అమ్మ‌వారికి కేజీన్న‌ర బంగారు కాసుల పేరు!

తిరుచ‌నూరు అమ్మ‌వారికి బంగారు కాసుల పేరును భ‌క్తులు బ‌హూక‌రించారు. తమిళనాడు రాష్ట్రం మధురై వాస్తవ్యులు  డాక్ట‌ర్ కే. జీ. శ్రీనివాసన్, ఆయ‌న భార్య కవిత ఈ బ‌హూక‌ర‌ణ చేశారు. శ్రీ జయప్రభ జ్యువెలర్స్ మధురై నందు తయారు చేయించిన  కేజీ 300 గ్రా బంగారు ఆభ‌ర‌ణం కాసుల పేరును అందించారు. నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా ఆధ్వర్యంలో తిరుచనూరు పద్మావతీ అమ్మవారికి ఈ కాసుల పేరును బహుకరించారు.
 
 
తమిళనాడులోని మధురై లో డాక్టర్ వృత్తిలో ఉన్న కే.జి. శ్రీనివాసన్, ఎం.డి. దంప‌తులు మధురైలోని ప్రముఖ బంగారు ఆభరణాల షో రూమ్ శ్రీ జయప్రభ జ్యువెలర్స్ లో ప్ర‌త్యేకంగా ఈ కాసుల పేరును త‌యారు చేయించారు. కేజీ 300 గ్రాముల‌ రెండు బంగారు హారములు ( కాసుల మాల)ని, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి బహూకరించారు.
 
 
ఈ కార్య‌క్ర‌మంలో శ్రీనివాసన్ ప్రతినిధులు కార్తీక్, జయప్రభ జ్యువెలర్స్ అధినేత ధనశేఖర్, పాండియన్,  తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ ఏఈవో, ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొని పద్మావతి అమ్మవారికి బంగారు  కాసుల మాలని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.