గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 3 జూన్ 2020 (19:47 IST)

ఏపీ టీచర్లకు గుడ్ న్యూస్.. బదిలీలకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్న‌ల్‌

నాడు-నేడు కార్యక్రమం దేశ చరిత్రలో నిలిచిపోవ‌డంతో పాటు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తొలి దశలో 500 కొత్తగా జునియర్ కళాశాలను ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు.

‘జగన్న గోరు ముద్ద’  కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. టీచర్ల బదిలీలకు సీఎం వైఎస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి జగన్‌ ఆదేశాల మేరకు బదిలీలు చేపడతామని వివరించారు.

వెబ్ బేస్‌ కౌన్సిల్ ద్వారా టీచర్ల బదిలీలు ఉంటాయ‌ని, బ‌దిలీలు కోసం టీచర్లు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. పదవ తరగతి పరీక్షలు పూర్త‌య్యాక స్కూల్స్ ప్రారంభం అయ్యేలోపు టీచర్ల బదీలీలు ఉంటాయని మంత్రి స్ప‌ష్టం చేశారు.

విద్యార్థులు లేరన్న సాకుతో స్కూళ్లు మూసివేయడం లేదన్నారు. గత ప్రభుత్వం హయాంలో 7 వేలకు పైగా స్కూళ్లు మూసేశారని తెలిపారు.

ఒక్క స్కూల్ కూడా మూయడానికి వీల్లేదని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్ల‌డించారు.