మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 మే 2022 (22:14 IST)

అత్తారింటికి వెళ్లే ఆడపడుచులకు సీఎం జగన్ గుడ్ న్యూస్

bride
అత్తారింటికి వెళ్లే అమ్మాయిలకు ఇక ఇబ్బందులు లేకుండా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ గుడ్ న్యూస్ చెప్పారు. వివాహం అనంతరం అమ్మాయిలకు అత్తారింట్లో నమోదు చేసుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి ఇకపై ఆ టెన్షన్ అవసరం లేదు. 
 
గ్రామ, వార్డు సచివాలయాల్లో వారి పేర్లను నమోదు చేస్తారు. అత్తారింటికి చెందిన కుటుంబంలో సభ్యురాలిగా పేరు నమోదు చేసుకునే అవకాశం గ్రామ సచివాలయంలో అందుబాటులో ఉంటుంది.
 
వాలంటీర్లు కుటుంబ సభ్యులుగా పేరు నమోదు చేసిన తర్వాత రేషన్ కార్డులో పేరు చేరుస్తారు. కొత్తగా పేరు నమోదు చేయించుకోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందడానికి కూడా వీలు ఉంటుంది.