సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (17:12 IST)

పదో తరగతి విద్యార్ధులకు గుడ్ న్యూస్

ఏపీలోని పదో తరగతి విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా.. సిద్ధమయ్యే విధంగా ఇంటి వద్ద నుంచే క్లాసులు వినేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల అధ్వర్యంలో రేపటి నుంచి దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ ద్వారా ఆన్లైన్ పాఠాలను బోధించనున్నారు.

పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన క్లాసులను ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు.. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రత్యేక్ష ప్రసారం చేయనున్నారు.

కాగా, ఛానల్‌లో ప్రసారమయ్యే క్లాసులను విద్యార్ధులు తప్పనిసరిగా ఫాలో కావాలని అధికారులు సూచిస్తున్నారు.