శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 మే 2021 (19:56 IST)

టీటీడీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..

తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. టీటీడీలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ బోర్డు నిర్ణయాన్ని ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు తిరుపతి పరిసర ప్రాంతాల్లో 250 ఎకరాల నుంచి 400 ఎకరాల భూమిని గుర్తించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
 
ఇక వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల జోరు కొనసాగుతోంది. పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన నవరత్నాల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు.
 
ఇప్పటికే జగనన్న ఇళ్ల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇళ్లు కట్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మఒడి, పెన్షన్, ఫీజురీయింబర్స్ మెంట్ వంటి పథకాలను అమలు చేస్తున్నారు. తాజాగా టీటీడీ ఉద్యోగులకు కూడా ఇళ్ల పట్టాలు పంపిణీకి సిద్ధమవుతుండటం విశేషం.