ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (07:44 IST)

కాలుష్య నియంత్రణకు హరిత పన్ను

పరిశ్రమలనుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. అటవీ, పర్యావరణ శాఖలపై సమీక్ష నిర్వహించిన ఆయన...కాలుష్య నియంత్రణకోసం హరిత పన్ను విధిస్తామన్నారు.

అటవీ, పర్యావరణశాఖలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమవేశంలో అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై అధికారులకు సీఎం కీలక సూచనలు చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదానికి జగన్ ఆదేశాలు జారీ చేశారు.

పర్యావరణ విధ్వంసాన్ని సహించేది లేదన్నారు. పరిశ్రమల కాలుష్యాన్ని నియంత్రించే బాధ్యతను ప్రభుత్వం తీసుకొని హరత పన్ను విధిస్తామని స్పష్టంచేశారు. ప్రస్తుత కాలుష్య నియంత్రిణ బోర్డు, సంబంధిత వ్యవస్థల్లో ప్రక్షాళన చర్యలు చేపడతామన్నారు.

పర్యావరణ పరిరక్షణలో దేశానికి మనరాష్ట్రం మార్గదర్శకంగా ఉండేవిధంగా తయారవ్వాలన్నారు. నెలరోజుల్లోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జగన్ సూచించారు. ఈ ప్రతిపాదనలపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామన్నారు. విశాఖలో కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాలన్నారు.

గోదావరి జిల్లాల్లో పంటకాల్వల పరిరక్షణకు మిషన్ గోదావరి కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇ-వేస్ట్ కోసం కాల్ సెంటర్​ను ఏర్పాటు చేయాలన్నారు. చెట్లను పెంచంటంలో గ్రామ వాలంటీర్ల సహకారం తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటికీ నాలుగు మెుక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.