బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (07:36 IST)

మాట వినని అధికారులపై బదిలీ వేటా!

ఎలక్ట్రిక్ బస్సులు క్విడ్ ప్రోకోలో భాగంగానే తక్కువకు కోట్​ చేశారని చంద్రబాబు ఆరోపించారు. మేఘా సంస్థకు ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవనే ఎండీగా ఉన్న సురేంద్రబాబును తప్పించారన్నారని తెదేపా అధినేత అన్నారు.

పోలవరం రివర్స్‌ టెండర్లతో 750కోట్లు తగ్గించామని చెప్పుకొంటూ 7,500 కోట్లు నష్టం చేకూరుస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ ముఖ్య నేతలతో తెదేపా అధినేత టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పోలవరానికి గతంలో ఎక్కువ కోట్ చేసిన సంస్థ ఇప్పుడు తక్కువ కోట్ చేయడం వెనుక మతలబు ఉందన్నారు.

ఎలక్ట్రిక్ బస్సులు క్విడ్ ప్రోకోలో భాగంగానే తక్కువకు కోట్​ చేశారని ఆరోపించారు. మేఘా సంస్థకు ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవనే ఎండీగా ఉన్న సురేంద్రబాబును తప్పించారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నంలో... ఆ బురద జగనే పూసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

పీపీఏలపై హైకోర్టు తీర్పు, కేంద్రమంత్రి లేఖే ఇందుకు నిదర్శనమన్నారు. గోదావరి ప్రమాదంలో వరద తగ్గినా బోటు తీసే ప్రయత్నం చేయటంలేదని మండిపడ్డారు. ప్రైవేటు సంస్థ ముందుకొచ్చి తీస్తామన్నా అనుమతివ్వకపోవడంపై ధ్వజమెత్తారు. అంశాలవారీగా త్వరలోనే పోరాట కార్యాచరణ రూపొందించుకుందామని నేతలకు తెలిపారు