శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (21:09 IST)

18 లక్షల మంది యువత భవిష్యత్తుతో ఆటలా..?: చంద్రబాబు

రామ సచివాలయ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని ప్రతిపక్షనేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఉద్యోగాల పేరుతో 18 లక్షల మంది యువత భవిష్యత్తులో ఆటలాడుకుంటారా అని ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించారు.

ఉద్యోగాల పేరుతో 18 లక్షల మంది యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటారా అని వైకాపా ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. గ్రామ సచివాలయ ప్రశ్నపత్రాల లీకేజ్ ఆరోపణలపై సంబంధిత శాఖ, ప్రభుత్వం ఇప్పటివరకు నోరు విప్పలేదని మండిపడ్డారు.

పరీక్షలతో తమకేమీ సంబంధం లేదని ఏపీపీఎస్సీ అంటుందని.. మరి దీనికి బాధ్యులెవరని ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంపై సత్వరమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ప్రతిపక్షాలు అసూయతో మాట్లాడుతున్నాయని వైకాపా నేతలు వ్యాఖ్యానిస్తున్నారని.. అసలు అసూయ పడేందుకు వాళ్లు చేసిన ఘనకార్యాలేంటో అర్థం కావటం లేదన్నారు చంద్రబాబు.