బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (16:28 IST)

వాలంటీర్ వక్రబుద్ధి.. బాలింతపై లైంగిక వేధింపులు..

వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. గర్భవతి అయినా బాలింతలైనా కామాంధుల దుశ్చర్యలకు హద్దుల్లేకుండా పోతున్నాయి. తాజాగా ప్రజాసేవకు పాటు పడాల్సిన ఓ వాలంటీర్ వక్రబుద్ది చూపించాడు. బాలింతపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. 
 
మాచవరం మండలం పిల్లుట్ల గ్రామంలో వాలంటీర్‌గా పనిచేసే గోపీ.. ఓ బాలింతను కామవాంఛ తీర్చాలంటూ వేధించాడు. అంతటితో ఆగకుండా ఇంట్లోకి వచ్చి బలవంతం చేయబోయాడు. దీంతో బాధితురాలు పాలు తాగుతున్న బిడ్డను వదిలి బయటకు పరుగులు తీసింది. 
 
ఈ విషయం ఊర్లో వారికి చెబితే ఊరుకునేది లేదంటూ బెదిరింపులకు తెగబడ్డాడు. వేధింపులు తాళలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించించింది. వాలంటీర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని మాచవరం ఎస్‌ఐ కోటయ్య తెలిపారు.