తిరుమలలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం..
తిరుమలలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతమైంది. ఓ మతిస్థిమితం లేని మహిళ బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్టు తేలింది. కుమారుడి కోసం గాలించిన తల్లి సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాలుడి తండ్రి ఓ హోటల్‌లో పనిచేస్తుండగా, తల్లి స్వాతి శ్రీవారి ఆలయ సమీపంలో భక్తుల నుదుట గోవింద నామాలు పెడుతూ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నారు.
ఆదివారం సాయంత్రం గొల్లమండపం సమీపంలో బాలుడి వద్దకు వచ్చిన గుర్తు తెలియని మహిళ అతడికి స్వీట్లు తినిపించి ఆపై తనతోపాటు తీసుకెళ్లిపోయింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. పింక్ చుడీదార్ ధరించిన మహిళ బాలుడిని తీసుకెళ్లినట్టు సీసీటీవీల్లో రికార్డయింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె కోసం వెతుకులాట ప్రారంభించి... బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.