గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 23 జనవరి 2018 (11:55 IST)

కాంట్రాక్ట్ ప్రొఫెసర్‌ను వేధించిన ఆ ముగ్గురు..

కర్నూలులోని రాయలసీమ యూనివర్శిటీలో ఓ అధ్యాపకురాలికి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. మెరిట్‌పై కాంట్రాక్ట్ ప్రొఫెసర్‌గా చేరిన యువతిని తోటి అధ్యాపకులు వేధించడం మొదలెట్టారు. తననే పెళ్లిచేసుకోవాలంటూ ముగ్గురు

కర్నూలులోని రాయలసీమ యూనివర్శిటీలో ఓ అధ్యాపకురాలికి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. మెరిట్‌పై కాంట్రాక్ట్ ప్రొఫెసర్‌గా చేరిన యువతిని తోటి అధ్యాపకులు వేధించడం మొదలెట్టారు. తననే పెళ్లిచేసుకోవాలంటూ ముగ్గురు ప్రొఫెసర్లు ఆమెను వేధించడం మొదలెట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. అవివాహితురాలైన ఓ యువతి, మెరిట్‌పై కాంట్రాక్టు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా 2017 జూలైలో ఉద్యోగంలో చేరారు. ఆమెను ముగ్గురు తోటి ప్రొఫెసర్లు.. తనను పెళ్లి చేసుకోవాలంటే.. తనను పెళ్లిచేసుకోవాలని వేధిస్తున్నారు. వారి వేధింపులను తట్టుకోలేని బాధితురాలు, ఉద్యోగం వదిలి వెళ్లడానికి సిద్ధమైంది. 
 
ఆ యువతిని వేధించిన వారిపై గతంలో ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వుండటంతో.. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని... యువతిని వేధించిన వారిపై చర్యలు తీసుకుంటామని వర్శిటీ రిజిస్ట్రార్ అమర్ నాథ్ హామీ ఇచ్చారు.