గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 జనవరి 2022 (12:00 IST)

రఘురామకృష్ణంరాజు ఇంటి వద్ద టెన్షన్.. పోలీసులు వెయిటింగ్... ఎందుకంటే?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంటి వద్ద పోలీసుల టెన్షన్ మొదలైంది. రఘురామకృష్ణంరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు నోటీసు ఇవ్వడానికి అధికారులు వచ్చినా ఆయన బయటికి రాకపోవడంతో ఇంటి వద్దే సీఐడీ అధికారులు వేచి వున్నారు. గతేడాది రఘురామపై క్రైం నెంబర్ 12/2021 లో 153-A, 505, 124-A R/w 120B Ipc సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. 
 
ఆ కేసుకు సంబంధించి ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు సూచించారు. రఘురామకు సంబంధించిన లాయర్లతో సీఐడీ పోలీసులు మాట్లాడారు. రఘురామ గురువారం నరసాపురం వెళ్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. రెండ్రోజులపాటు నరసాపురంలో పర్యటిస్తానన్నారు. ఇప్పుడు సీఐడీ నోటీసులు ఇచ్చేందుకు రావడం చర్చనీయాంశమైంది.
 
రఘురామను మే 14న సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో నోటీసులిచ్చి అదుపులోకి తీసుకుని.. గుంటూరు తరలించారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారన్న అభియోగాలతో ఆయన్ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.