శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 జూన్ 2022 (21:37 IST)

ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు అప్.. జూలై 1 నుంచే అమలు

apsrtc bus
ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి.పెరిగిన ధరలు జూలై 1 నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ గురువారం (జూన్ 30) ఉత్తర్వులు వెలువరించింది. 
 
డీజిల్‌ సెస్‌ పెంపు వల్ల ఛార్జీలు పెంచక తప్పలేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు. పల్లె వెలుగు బస్సుల్లో ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10గా ఉండగా.. తొలి 30 కిలోమీటర్ల వరకు ఎలాంటి పెంపు లేదని ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది. 
 
35 కి.మీ. నుంచి 60 కి.మీ వరకు అదనంగా రూ.5 సెస్‌ విధిస్తున్నట్లు తెలిపింది. ఇక 60 నుంచి 70 కి.మీ వరకు రూ.10, వంద కిలోమీటర్లు ఆపైన రూ.20 సెస్‌ విధించారు.
 
ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో ప్రస్తుతం టికెట్‌పై రూ.5 చొప్పున సెస్ వసూలు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ 30 కి.మీ. దూరం వరకు ఎలాంటి సెస్‌ పెంపు లేదు. 31 కి.మీ. నుంచి 65 కి.మీ వరకు రూ.5 సెస్‌. 66 కి.మీ. నుంచి 80 కి.మీ వరకు రూ.10 సెస్ విధించనున్నారు.