ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : మంగళవారం, 7 మార్చి 2017 (16:28 IST)

తిరుపతిలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు : విటుల్లో ప్రజాప్రతినిధి

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్‌గా మారిపోతోంది. బెంగుళూరు, చెన్నై రాష్ట్రాల నుంచి కొంతమంది వ్యక్తులు తిరుపతిని కేంద్రంగా చేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్‌గా మారిపోతోంది. బెంగుళూరు, చెన్నై రాష్ట్రాల నుంచి కొంతమంది వ్యక్తులు తిరుపతిని కేంద్రంగా చేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. గోవిందనామస్మరణలు వినిపించాల్సిన ఆధ్మాత్మిక క్షేత్రంలో వింత శబ్దాలు వినిపించేలా చేస్తున్నారు. జనావాసాల మధ్యే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా మామూళ్ళకు అలవాటు పడ్డ పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. 
 
తిరుపతి, తిరుపతి పరిసర ప్రాంతాల్లో వ్యభిచార ముఠా ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. కొన్ని ప్రాంతాల్లో వ్యభిచార ముఠాలు స్థావరాలను ఏర్పాటు చేసేసుకున్నాయి. ప్రజల మధ్యే ఇళ్ళను అద్దెకు తీసుకున వ్యభిచార గృహాలను నడిపేస్తున్నాయి. నిరుద్యోగ యువతులను ఈ రొంపిలోకి దింపి డబ్బులను ఈజీగా సంపాదించేస్తున్నారు. అవిలాలలోని పేపర్స్ కాలనీలో వ్యభిచార ముఠా కార్యకలాపాలు జరుగుతోందన్న పక్కాసమాచారంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. 
 
నిందితుల్లో ఒక రాజకీయ నాయకుడు కూడా ఉన్నాడు. చెన్నైకు చెందిన ఒక మహిళ అవిలాలలో ఇంటిని అద్దెకు తీసుకుని నిరుద్యోగ యువతులను మభ్యపెట్టి వ్యభిచారంలోకి దింపి గత కొన్నిరోజులుగా వ్యభిచార గృహాన్ని నడుపుతోంది. చెన్నై, బెంగుళూరు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారితో పరిచయాలను ఏర్పరచుకుని వ్యభిచార గృహాన్ని గత కొన్నిరోజులుగా నిర్వహిస్తోంది. హైవేలపై కారులో వెళుతున్న వారిని ఆకర్షిస్తూ యువతలును నిలబెడతారు. వెంటనే కారు ఆపిందే వారిని తమ స్థావరాలకు తీసుకెళ్ళి పని కానిచ్చేస్తారు.
 
ఇలా గత రెండుసంవత్సరాలుగా హైవేలపైనే ఈ తతంగమంతా జరుగుతోంది. ఇళ్ళ మధ్యే వీరు వ్యభిచార గృహాన్ని నడుపుతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కనీసం ఇంటి పక్కనున్న వారికి కూడా అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు ఈ ముఠా. అయితే పోలీసులకు పక్కా సమాచారం రావడంతో ముఠా సభ్యులను పట్టుకున్నారు. అలాగే కొర్లగుంటలో కూడా మరో వ్యభిచార ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సరోజమ్మ అనే వ్యభిచార ముఠా నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తిరుపతి లాంటి పవిత్రప్రాంతం ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.