శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 27 నవంబరు 2017 (13:50 IST)

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. ఉజ్బెకిస్థాన్ నుంచి?

హైదరాబాద్ నగరంలో సాగుతున్న సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. తద్వారా ఉజ్భెకిస్థాన్ మహిళలకు విముక్తి లభించింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు విదేశీ మహిళలు వ్యభ

హైదరాబాద్ నగరంలో సాగుతున్న సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. తద్వారా ఉజ్భెకిస్థాన్ మహిళలకు విముక్తి లభించింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు విదేశీ మహిళలు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ప్రాంతంలోని వ్యభిచార కూపాలపై దాడి చేశారు. ఈ క్రమంలో నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.
 
ఇప్పటికే ముగ్గురు నిర్వాహకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. వారంలోనే మూడు సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశామని పోలీసులు తెలిపారు. రాచకొండ పరిధిలో ఉజ్భెకిస్థాన్‌కు చెందిన 20 ఏళ్ల యువతులు పట్టుబడ్డారని వారికి విముక్తి కలిగించినట్లు తెలిపారు.
 
టూరిస్ట్ వీసాలో ఢిల్లీకి వచ్చిన యువతులను ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కు తీసుకొచ్చి.. వ్యభిచార రొంపిలోకి దించేస్తున్నారని.. వీసా కాలం ముగిసిపోవడంతో ఆ యువతులు కూడా నరకం అనుభవించారని పోలీసులు తెలిపారు.